UP cm yogi adityanath father anand singh bisht passed away
తండ్రి మరణానికి తీవ్రంగా దు:ఖిస్తున్నానని అయితే కరోనా మహమ్మారి యూపిలో రోజు రోజు కు విజృంబిస్తున్న ఇలాంటి పరిస్థతులలో తాను తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ నూ మార్చి 13న చికిత్స నిమిత్తం న్యూఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు, అప్పటి నుండి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు. ఆనంద్‌సింగ్ గతంలో ఉత్తరాఖండ్ అటవీశాఖలో రేంజర్‌గా పనిచేసేవారు. కానీ తన తండ్రి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నానని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం అంతిమ సంస్కారాలు జరుగుతాయని ఆయన తరపు బంధువులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది రాజకీయ నాయకులు ఆప్తులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు వారి ప్రగాడ సానుభూతి తెలిపారు.