Thursday, May 13, 2021

Latest Posts

ఎన్ కౌంటర్ పై  రియల్‌స్టార్‌ ఉపేంద్ర షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్‌లో ఎన్‌కౌంటర్‌పై రియల్‌స్టార్‌ ఉపేంద్ర చేసిన ట్వీట్‌ సర్వత్రా విమర్శలకు కారణమైంది. ఆ నలుగురూ ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో? లే దో? ఈ సంఘటన వెనుక ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమో? ఇదే తరహాలో ఎన్‌కౌంటర్‌లు ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఎం దుకు జరగవు? కోర్టులో విచారణలకు ముందే ఎన్‌కౌంటర్‌ ఇకపై ప్రముఖుల కేసుల్లోనూ రెడ్‌కార్పెట్‌ కానుందా? అని ఆయన పేర్కొన్నారు.

దిశపై హత్యాచారం చేశారని నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేయడంపై ఉపేంద్ర విభిన్నంగా ట్వీట్‌ చేయడం షాకింగ్ కి గురిచేసింది. ఒకానొక కాలంలో ఎన్‌కౌంటర్‌ను రౌడీయిజం తగ్గించేందుకు సాగేవని, నిజాయితీ పోలీసు అధికారుల మనసు పెడితే ఎన్‌కౌంటర్‌ ద్వారా అత్యాచారాలను నియంత్రించవచ్చునని ప్రముఖులు, శ్రీ మంతులు దుర్వినియోగం చేసుకోకుండా అధికారులు హెచ్చరికగా ఉండాలని ఉపేంద్ర ట్వీట్‌ చేశారు.

ఉపేంద్ర  ట్వీట్‌పై అభిమానులు మద్దతుగాను మరికొందరు వ్యతిరేకంగాను స్పందించారు.మురికివాడలకు చెందినవారని ఎన్‌కౌంటర్‌ చేశారే అనుకుందాం..? ఈ సంఘటనలో మరొకరు ఉన్నారనే అభిప్రాయం ఎంతవరకు సమంజసమని, మరొకరు ఉన్నారంటే అంతా తప్పు జరిగినట్టు కాదా? అని పలువురు కామెంట్స్ చేశారు. ఉపేంద్ర  సినిమా నటుడే కాదు, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారని బాధ్యతాయుతంగా స్పందించాలని పలువురు వ్యాఖ్యానించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss