Uppena Movie Review By Super Star Mahesh Babu
పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం, ఉప్పెన కలెక్షన్లతో పాటు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంటుంది. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మనసును కూడా కొల్లగొట్టింది. వరుస ట్వీట్లతో, ఈ చిత్రం మరియు బృందం వారి గొప్ప కృషికి ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు బుచిబాబు సనా ఈ చిత్రాన్ని క్లాసిక్ మరియు వన్ ఆఫ్ ది రేర్ గా తయారు చేసినందుకు అభినందించారు.
దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు ఇచ్చిన పాటలలో ఈ సినిమా దీ బెస్ట్ అని అలానే ఈ సినిమా హిట్ కావడానికి అసలు కారణం పాటలు అని ఆయన తెలిపారు. అలానే ఈ సినిమాతో డెబ్యూట్ చేసిన హీరో, హీరోయిన్ కి కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. వారు తొందరలోనే పెద్ద స్టార్స్ అవుతారని వెల్లడించారు.
అలానే వీరి పై నమ్మకం ఉంచి సినిమాను నిర్మించి మైత్రి మూవీ మేకర్స్ వారిని కూడా అభినందించారు. అలానే మాటలు, రైటింగ్స్ లో సాయం చేసిన సుకుమార్ గారిని ప్రశంసించారు. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం దుబాయి లో సర్కారు వారి పాట సినిమాకి షూటింగ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: