US crude oil prices falling down to minus dollar price :
వాటర్ బాటిల్ కంటే క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా నమోదు అయ్యింది. కరోనా మహమ్మారి సృష్టిస్తున్న సంక్షోభం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుప్ప కూల్చేసింది. దీనితో దేశ చరిత్రలోనే తొలిసారిగా అమెరికాలో క్రూడ్ ఆయిల్ ధర మైనస్ లోకి పడిపోయింది. లాక్ డౌన్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉన్న నిల్వలు ఎలా అమ్ముకోవాలో అర్ధం కాక ఆయిల్ కంపెనీలు తల పట్టుకున్నాయి. బహుశా చరిత్రలో ఎప్పుడు ఇంధన రంగం ఈ స్థాయి సంక్షోభం ఎదుర్కొని ఉండదు. కరోనా కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ ని పొడిగిస్తూ ఉండడంతో, ఆయిల్ వినియోగం ఎపుడు లేని స్థాయిలో పడిపోయింది. దీనితో పెట్రోలియమ్ ఉత్పత్తులకు డిమాండ్ లేకుండా పోయింది.
లాక్ డౌన్ కారణంగా ముడి చమురు నిల్వలు పేరుకుపోవడం డిమాండ్ సప్లై చైన్ కు బ్రేక్ రావడంతో క్రూడ్ ఆయిల్ కంపెనీలు షాక్ అయిపోతున్నాయి. అమెరికా చరిత్రలోనే ఎప్పుడు లేని విదంగా, బారెల్ క్రూడ్ ఆయిల్ ధర మైనస్ డాలర్ లోకి వెళ్ళిపోయింది. అంటే అమ్మే వాళ్ళు ఉన్నారు గాని, కొనే వాళ్ళు లేరు. అమెరికా మార్కెట్ లను ఇంధన సూచిలు షాక్ చేశాయి. వెస్ట్ టెస్వ్స్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్ -37 . 63 వద్ద ముగిసింది. నిన్న ఒక్క రోజే బారెల్ ధర 90 శాతం పడిపోయింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
అన్ని దేశాలు లాక్ డౌన్ కొనసాగించడంతోమే నెలకు సంబందించిన ఆయిల్ ఒప్పందాలను చాల దేశాలు రద్దు చేసుకున్నాయి. దీనితో ఇంధన ఉత్పత్తి దారులపై ఒత్తిడి పెరిగిపోయింది. పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఇంధన యుద్దానికి తోడు, కోవిద్ 19 రాచేసిన చిచ్చు ఆయిల్ మార్కెట్‌కి మాన్తా పెట్టింది. వినియోగం తగ్గడంతో ఇంధన నిల్వలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉన్న నిల్వలను కాళీ చేస్తే తప్ప కొత్త ఉతపట్టి మొదలవ్వటం సాధ్యం కాదు. కాగా కరోనా ఎఫెక్ట్ తగ్గినపుడే మల్లి ఇంధన నిల్వలు కాళీ అయ్యే ఒక అవకాశం తప్ప మరో అవకాశం లేదు.