అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. కౌంటింగ్ మొదట్లో బైడెన్ ఆధిపత్యం కనిపించినా ఆ తర్వాత ట్రంప్ వైపు మొగ్గు చూపాయి. కేవలం అరిజోనా, న్యూహాంప్‌షైర్, నెవడాలు మొదటి నుంచి బైడెన్‌కు పట్టంకట్టాయి. కానీ, విస్కాన్సిన్ ఫలితాలు మాత్రం ట్రంప్, బైడెన్ ఇద్దరికి చుక్కలు చూపిస్తున్నాయి. మొత్తం 10 ఎలక్టోరల్ ఓట్లున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బైడెన్ 1 శాతం ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మధ్యలో ట్రంప్ దాదాపు 4శాతానికి పైగా ఆధిక్యంలో దూసుకుపోయినా.. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయారు. 95శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి బైడెన్‌కు 49.09 శాతం పోల్‌కాగా.. ట్రంప్‌నకు 48.94 శాతం ఓట్లు పోలయ్యాయి. మరో ఐదుశాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. అవి ఇక్కడి 10 ఎలక్టోరల్ ఓట్లు ఎవరికి దక్కనున్నాయో తేల్చనున్నాయి. కాగా పెన్సిల్వేనియాలోని 20 ఎలక్టోరల్ ఓట్లు కీలకంగా మారాయి. దీన్ని గెలిస్తే మేజిక్ మార్క్ 270ను దాటే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆలస్యంగా వచ్చిన ఓట్లను కూడా అనుమతిస్తున్నారని ట్రంప్ మండిపడుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళతామంటున్నారు. అదే సమయంలో మరో 10లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందని చివరి ఓటు వరకు లెక్కిస్తామని ప్రకటించారు గవర్నర్ టామ్ వోల్ఫ్. దీంతో మొదటి నుంచి మెయిల్ ఇన్ బ్యాలెట్లపై సీరియస్‌గా ఉన్న ట్రంప్‌కు ఇది మరింత ఆగ్రహం తెప్పించింది. దీన్ని అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. ఈ రాష్ట్రాల్లో మిలియన్ల కొద్దీ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి తానే గెలిచినట్లు ప్రకటించుకొన్నారు. దీనిపై మండిపడ్డారు జోబైడెన్. ట్రంప్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన న్యాయస్థానికి వెళితే ఎదుర్కొనేందుకు తమ న్యాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి: