Sunday, June 20, 2021

Latest Posts

మోడీ కి ఫోన్ చేసిన కమలా హారిస్ ఏమన్నారంటే

US Global Vaccine Sharing

కోవిడ్ వ్యాక్సిన్ కొరతతో ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో ప్రపంచ దేశాలకు సాయం చేయడం కోసం అమెరికా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. మొదటి గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ లో భాగంగా ప్రపంచ దేశాలకు 25 మిలియన్ వ్యాక్సిన్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత జూన్ చివరికల్లా 80 మిలియన్ వ్యాక్సిన్లను పంచనున్నట్లు తెలిపారు.

దీని పై మోడి స్పందిస్తూ, అమెరికా చేస్తున్న పనిని తీవ్రంగా అభినందిస్తూ, అమెరికా ప్రభుత్వం, వ్యాపారాలు మరియు యుఎస్‌లో నివసిస్తున్న భారతీయుల సహకారం మరియు సంఘీభావానికి ఉపరాష్ట్రపతి హారిస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మోడీ ట్వీట్ చేశారు. అంతే కాకుండా భవిష్యత్ లో కూడా అమెరికా ఇండియా బంధం బాగుండాలని మోడీ కోరారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆర్ధిక వ్యవస్థ మెరుగయ్యేలా భారత్ అమెరికా కృషి చేయాలని ఆయన సూచించారు.

మే లో, బైడెన్ పరిపాలనలో అమెరికాను సందర్శించిన తొలి భారత క్యాబినెట్ మంత్రి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, తన రెండు రోజుల పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులతో వ్యాక్సిన్లు మరియు కరోనా మహమ్మారి నివారణ గురించి ఎక్కువగా చర్చించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss