Thursday, December 2, 2021

Latest Posts

అమెరికాను వణికిస్తున్న డెల్టా వేరియంట్

US health agency sounds alarm on Delta variant

అమెరికాలో నలభై శాతం వ్యాక్సినేషన్ పూర్తి అవ్వగానే మాస్క్ ఫ్రీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పుడు మాస్క్ ఫ్రీ ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు వ్యక్తిగత కార్యాలయాలలో కూడా మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా ఇండోర్‌ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలంటూ సీడీసీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. దిని  కంతటికీ కారణం డెల్టా వేరియంట్.  అగ్రరాజ్యాన్ని మరోసారి వణికిస్తుంది డెల్టా వేరియంట్. గతంలో ఒక్క రోజులో అత్యధికంగా 10,170 మంది ఆసుపత్రుల్లో చేరగా, ఇప్పుడు 10,207 మంది చేరినట్లు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం ప్రకటించిందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్లోరిడా నగరంలో డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కాగా ఈ డెల్టా వేరియంట్ అమెరికా లోనే కాదు ఆస్ట్రేలియాలో జర్మనీలో కూడా వేగంగా వ్యాపిస్తుందని అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss