Wednesday, June 23, 2021

Latest Posts

ఈ రోజే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం వచ్చింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓటు వేసేలా సర్వం సిద్ధం చేశారు. మెయిల్‌, ముందస్తు ఓటింగ్‌ ద్వారా దాదాపు పది కోట్ల మంది  మంది తమ ఓట్లను ముందుగానే వినియోగించు కున్నారు. 2016 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లలో మూడింట రెండు వంతుల ఓట్లు ఇప్పటికే పోలయ్యాయి కాగా ఇదో కొత్త రికార్డ్‌ కూడా.

చివరి క్షణం వరకూ అలుపెరగకుండా ట్రంప్‌, బైడెన్‌ పర్యటనలు చేసుకుంటూ వచ్చారు. బైడెన్‌ అయితే మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను వెంటేసుకుని ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక సర్వేలన్నీ జోబైడెన్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇద్దరి మధ్య దాదాపు 9 శాతం ఓట్ల తేడా ఉంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ కన్నా బైడెన్‌ ముందజంలో ఉన్నాడని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్‌కు 42 శాతం సర్వేలు అనుకూలంగా ఉండగా.. జోబైడెన్‌కు 51శాతం అనుకూలంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss