కరోనా మహమ్మారి బారిన ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతు ఈ రోజు మరణించినట్టు ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత అయిన ఆయనతో మరికొంత మండి జర్నలిస్ట్‌ను ఎస్ఎన్ మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించాం. బుధవారం నుంచి వెంటిలేటర్ మీద ఉన్న బాధితుడు చనిపోయాడ’ని సింగ్ చెప్పారు.
కాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కేసులు నమోదు కాగా, 103 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 56,342 కాగా, వారిలో 16,540 మంది కరోనా నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరణాల సంఖ్య 1,886కి పెరిగింది.
ఇది కూడా చదవండి:దైవ నామస్మరణతో కరోనా కంట్రోల్