లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు పెద్దగా జరగని రోడ్డు ప్రమాదాలు ఒక్క సారిగా సడలించిన మార్గదర్శకాలతో తరచూ జరుగుతూ ఉంటున్నాయి. చాలా రోజుల క్రితం వ్యవసాయ, ఆహార తరలింపు వాహనాలకు అనుమతులిచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అనుమతులతో అన్ని వాహనాలు రోడ్ల మీదకు వస్తున్నాయి. అలా రద్దీగా మారిన రోడ్లు ప్రమాదాలకు కూడా తావిస్తున్నాయి.
ఇలాంటి ఒక సంఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగి, ఆ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం జరిగింది. ఎతవా సమీపంలో రెండు ట్రక్కులు ఢీకొనగా జరిగిన ఈ ప్రమాదంలో కొంత మందికి గాయాలవ్వడం జరిగింది. పండ్లను విక్రయించేందుకు రైతులు మార్కెట్కు వెళ్తుండగా ప్రమాదం చోటు జరిగిందని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: యువతులపై లైంగిక దాడి చేసిన వాచ్ మెన్
ఇది కూడా చదవండి: నో బర్త్ డే అంటున్న మంచు మనోజ్