Wednesday, June 23, 2021

Latest Posts

ఈ రోజు రెండో విడత వైఎస్ఆర్ వాహన మిత్ర

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో వాహన దారులకు అక్టోబర్‌లో ఇవ్వాల్సిన ఆర్ధిక సాయాన్ని నాలుగు నెలల ముందుగానే ప్రభుత్వం విడుదల చేస్తున్నది. గతేడాది సెప్టెంబర్ 23 నుంచి ఈ ఏడాది మే 16 మధ్య కొత్తగా వాహనాలు కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారికి కూడా ఈ పధకాన్ని వర్తింపజేశారు. నేడు  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ మోహన్  రెడ్డి గారు కంప్యూటర్ బటన్ ద్వారా వైఎస్ఆర్ వాహనమిత్ర పధకానికి సంబంధించి రెండో విడత సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి మొత్తం సొమ్ము ను  ఒకేసారి  జమ చేయనున్నారు. ఈ పధకం ద్వారా మొత్తం 2,62,493 మందికి రూ. 262.49 కోట్ల ఆర్ధిక సాయం అందించనుండగా సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా రూ. 10 వేలు చొప్పున జమ కానున్నాయి.అలాగే గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా 37,756 మంది లబ్దిదారుల జాబితాలో చేరారు.  ఈ పధకం కింద లబ్దిదారులకు ప్రతీ ఏటా ప్రభుత్వం పది వేలు సాయం చేయనుంది అని ఇది వరకే జగన్ తెలిపారు.

ఇది కూడా చదవండి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss