Vaishnav Tej Remuneration
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలి సినిమా ప్రభావం హీరోల మీద గట్టిగానే ఉంటుంది. అది హిట్టయిందంటే చాలు దర్శకనిర్మాతలు అతడితో కలిసి పని చేసేందుకు తహతహలాడుతుంటారు. ఒకవేళ ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయిందంటే ఆ హీరోతో సినిమా చేయడానికి వెనకడుగు వేస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే వైష్ణవ్ తేజ్ నటించిన మొట్టమొదటి సినిమా ఉప్పెన భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
దీనితో అతడికి ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. పైగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చాడన్న పేరు ఉండనే ఉంది. దర్శక నిర్మాతలు కూడా అతని వెనుక బానే పడుతున్నారు. దీంతో అతడు తన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో చేయబోయే సినిమాకు రూ.75 లక్షలు తీసుకోనున్నాడు.
అయితే ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ డీల్ కన్ఫార్మ్ అయింది. అలాగే నిర్మాత భోగవల్లి ప్రసాద్ కాంబినేషన్లో రానున్న చిత్రానికి ఏకంగా రూ.2.5 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశి బాబు మూడో సినిమాకే ఇంత పారితోషికం తీసుకుంటున్నాడా? అని షాకవుతున్నారు. ఈ క్రమంలో అతడి తొలి రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చని గుసగుసలు పెడుతున్నారు.
అయితే టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం తొలి సినిమా ఉప్పెన కోసం అతడు అక్షరాలా రూ.50 లక్షలు తీసుకున్నాడట. ఇది కొంత పెద్ద మొత్తంనే అయినా మెగా హీరో అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
ఇవి కూడా చదవండి: