Sunday, June 20, 2021

Latest Posts

ఉగాది రోజు పుంజుకున్న వకీల్ సాబ్ కలెక్షన్లు

Vakeel Saab Box Office Collection
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద గొప్పగా రాణిస్తోంది. ఈ చిత్రం 2000 కి పైగా స్క్రీన్స్ లో భారీగా విడుదలైంది. అలానే ఇది ఇండియన్ సినిమాలలో పోస్ట్ కరోనావైరస్ మహమ్మారి తర్వాత అతిపెద్ద ఓపెనర్‌గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది.

ఈ వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ రచన మరియు దర్శకత్వం చేయగా దిల్ రాజు మరియు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఓపెనింగ్ డే నుంచే సినిమా ప్రేక్షకుల వద్ద మంచి స్పందన లభించింది.

ఎపి, తెలంగాణలో 2, 3, 4 రోజులలో వకీల్ సాబ్ సినిమా రూ .10.74 కోట్లు, రూ .10.39 కోట్లు, రూ .4.19 కోట్లు వసూలు చేసింది. రిపోర్ట్స్ ప్రకారం, ఐదవ రోజు వకీల్ సాబ్ వసూలు రాష్ట్రంలో రూ .7-8 కోట్ల మధ్య వసూలు చేసినట్లు తెలుస్తుంది. నిన్న హాలిడే కావడంతో సోమవారం డౌన్ ఫాల్ అయిన కలెక్షన్స్ మళ్ళీ పుంజుకున్నాయి.  ఇక ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ ఇప్పటికే రూ .100 కోట్లు కలెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss