Vakeel Saab movie Fan Made Motion Teaser
అజ్ఞాత వాసి తరవాత సినిమాలు వదిలేసి రాజకీయాల్లో చేరిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్ మూవీ ‘పింక్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని మే విడుదల చేయాలని సన్నాహాలు చేశారు.
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ఫలితంగా ఈ చిత్రం విడుదల తేదీ కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్ డేట్ వచ్చినా అది విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ మధ్య విడుదల చేసిన పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అంతా ఇంతా సంచలనం సృష్టించలేదు. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులతో పాత రికార్డులను మొత్తం బద్ధలు కొట్టేసింది. పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో లాయర్‌గా కనిపించనున్నారు.
తాజాగా ఈ మూవీ లో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చేత్తో ఫైల్స్, మరో చేత్తో లెదర్ బ్యాగ్ పట్టుకుని లాయర్‌గా కోర్టుకు వెళ్తున్న పవన్ కల్యాణ్ పోస్టర్ ఫాన్స్ ని ఫిదా చేస్తోంది. అయితే ఈ పోస్టర్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్లో పవన్ కల్యాణ్ గుబురు గడ్డంతో ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షమైన ఈ పోస్టర్లో పవన్ కల్యాణ్ క్లీన్ షేవ్‌తో ఉన్నారు. ఇది ఒరిజనల్లా కాదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ పోస్టర్ ప్రేక్షకులకు విపరీతంగా అలరిస్తోంది