Vakeel Saab Fighting Photos
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో ఉంటుంది. అయితే సీరియస్ పొలిటీషియన్ గా మారిన ఆయన.. దాదాపు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వెంట వెంటనే సినిమాలు ప్రకటించిన పవన్.. శరవేగంగా పూర్తిచేస్తున్నారు.
వరుసగా నాలుగు సినిమాలు ప్రకటించిన పవన్ నుంచి.. మొదటగా రాబోతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నారు. ఇది పవన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో టీజర్ రిలీజ్ కాబోతుండగా.. ఇప్పుడు రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలోని క్లైమాక్స్ సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. వీటిని ఎవరూ లీక్ చేయలేదు. ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన నటుడు దేవ్ గిల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా పంచుకున్నాడు. అక్కడ నుంచి బయటకు వచ్చిన ఈ ఫొటోలు షేర్ల మీద షేర్లు అవుతున్నాయి.
‘వకీల్ సాబ్’ మూవీ బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసినట్టు అర్థమవుతోంది. మరి ఎలాంటి మార్పులు చేశారు? ఎలా తెరకెక్కించారు? అన్నది తెలియాలంటే కనీసం టీజర్ వరకు ఆగాల్సిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ అంజలిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: