Monday, May 10, 2021

Latest Posts

వకీల్ సాబ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Vakeel Saab Movie Review And Rating

రాజకీయాల్లోకి వెళ్ళిన మూడు సంవత్సరాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ వకీల్ సాబ్ పింక్ యొక్క అధికారిక రీమేక్. అయితే పవన్ కళ్యాణ్ మూడు సంవాత్సారాల తరువాత సినిమాల్లోకి తిరిగి రావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా ప్రేక్షకుల మనసును గెలించిందా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.

నటీ నటులు – పవన్ కళ్యాణ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్, శ్రుతి హాసన్
దర్శకుడు – వేణు శ్రీరామ్
నిర్మాతలు – దిల్ రాజు, బోనీ కపూర్
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం – ఎస్ ఎస్ తమన్

కథ: 

ముగ్గురు మధ్యతరగతి అమ్మాయిలు పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి) మరియు, దివ్య నాయక్ (అనన్య నాగల్లా) ఒక రిచ్ యువకుడు వంశీ (వంశీ కృష్ణ) మరియు అతని ఫ్రెండ్స్ వేధింపులకు గురి అవుతూ ఉంటారు. అయితే ఆ వేధింపుల నుండి వారిని వారు రక్షించుకునే  ప్రయత్నంలో వారి పై దాడికి పాల్పడతారు. దీనితో వారిని కోర్టుకు ఈడుస్తాడు ఆ రిచ్ యువకుడు. ఈ కేసును సస్పెండ్ అయిన న్యాయవాది వకీల్ సాబ్ కొనిదేలా సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) టేక్ ఓవర్ చేస్తారు. వకీల్ సాబ్ ఎవరు మరియు అతను కేసును న్యాయం వైపు ఎలా నడిపిస్తాడు, అనేది మరి థియేటర్ లోకి వెళ్ళి చూడాల్సిందే.

నటీ నటుల ప్రదర్శనలు: 

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రాలలో తిరిగి ప్రవేశించడంతో అభిమానులను మంత్రముగ్దులను చేస్తుంది. పవన్ కళ్యాణ్ నైతికతతో దూకుడు న్యాయవాదిగా మంచి ప్రదర్శన ఇచ్చాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో పవన్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఎక్కువ పర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ తన పాత్రకు తగిన న్యాయం చేస్తుంది. అంజలి, అనన్య నాగల్లా కూడా తమ పాత్రల్లో బాగానే చేశారు. పవన్ కి ఆపోజిట్ గా చేసిన ప్రకాష్ రాజ్ న్యాయవాదిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. శ్రుతి హాసన్ కేవలం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పార్ట్ లో మాత్రమే కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాలో పెద్దగా ఉపయోగం లేదు అనిపిస్తుంది.

సాంకేతికత: 

వకీల్ సాబ్ పింక్ యొక్క అధికారిక రీమేక్ కావడంతో, పవన్ కళ్యాణ్ యొక్క స్టార్‌డమ్‌కి సరిపడా సన్నివేశాలను జోడించడం మినహా దర్శకుడు స్క్రిప్ట్‌కు ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే దర్శకుడు కథను కాస్త మార్చినప్పటికీ చాలా సన్నివేశాల్లో ఒకే డైలాగులు, సన్నివేశాలు మరియు హావభావాలను ఉపయోగించాడు. మొత్తం మీద దర్శకుడు పవన్ స్టామినాను చూపించే ప్రయత్నం చేశాడు.

సినిమాటోగ్రఫీ బాగుంది మరియు విజువల్స్ చక్కగా ఉన్నాయి. అన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ముఖ్యంగా మెట్రో రైలు ఫైట్ ను బాగా తెరకెక్కించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ గానే కనిపిస్తుంది. మగువా మగువా పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ప్లస్: 
కోర్టు గది దృశ్యాలు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
పవన్ కళ్యాణ్
ప్రకాష్ రాజ్

మైనస్:
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్

రివ్యూ: 3.75/5

వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ యొక్క యాక్షన్ సీన్స్ మరియు లాయర్ కి పవన్ కి జరిగే సన్నివేశాల కోసం చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss