Vakeel Saab Teaser Release Date
రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ గబ్బర్ సింగ్ స్టార్ వకీల్ సాబ్ షూటింగ్ ని అప్పుడే కంప్లీట్ చేశాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను జనవరి 14 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తానని ప్రకటించినప్పటి నుండి, అభిమానులు వకీల్ సాబ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ రీమేక్ చిత్రం అని అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రుతి హసన్ జోడీగా నటిస్తుంది.
ఇవి కూడా చదవండి: