Saturday, October 24, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

వైసిపిలో నో ఎంట్రీ బోర్డు….వంశీ ఏమి చేస్తాడో?

గన్నవరం ఎమ్మెల్యే వంశీ టీడీపీలో కొన సాగుతారా లేక వైసీపీలో చేరుతారా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత నెల దీపావళి పండుగకు ముందు వంశీ సీఎం జగన్‌ను కలిశారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకు పార్టీ మార్పుపై వంశీ వర్గం ఎలాంటి అడుగు వేయలేదు. వంశీ సైతం తన అనుచర వర్గానికి పార్టీ మార్పుపై ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీ వర్గంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

వంశీపై కొద్ది రోజుల క్రితం నకిలీ పట్టాల కేసు నమోదైంది. ఆ తర్వాత నుంచి గన్నవరంలో రాజకీయాలు శరవేగంగా మారుతూ వచ్చాయి. వంశీ.. జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని వంశీ సీఎంతో చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అక్టోబరు 27 దీపావళి రోజున వంశీ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు వాట్సాప్‌లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ పంపారు. ఈ లేఖ అందిన తర్వాత చంద్రబాబు ప్రత్యుత్తరం ఇచ్చారు. వంశీని బుజ్జగిం చేందుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని, బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను

అధినేత రంగంలోకి దింపారు. వీరు వంశీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను టీడీపీలో కొనసాగే అవకాశాలు లేవని వంశీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ పరిణామాలతో టీడీపీ వంశీ వ్యవహారంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. వంశీ వాట్సాప్‌లో మినహా రాజీనామా లేఖ పంపలేదని, దీంతో సాంకేతికంగా ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నట్టని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వంశీపై అనర్హత వేటు వేయడం ద్వారా ఆయన రాజమార్గంలో పార్టీ మారే అవకాశాన్ని కల్పించినట్లవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వైసీపీ కూడా వంశీ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉంది.

సీఎం జగన్‌ను కలవడంతో వంశీపై చర్యలు తీసుకుంటారేమోనని వైసీపీ ఎదురుచూస్తోంది. వంశీ వైసీపీలో చేరాలంటే టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అలా కాకుండా వైసీపీలో చేరితే వంశీపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతానికి వైసీపీ అవకాశం కోసం ఎదురుచూస్తోంది. వంశీ రాజీనామా వ్యవహారాన్ని అవసరమైనప్పుడు వినియోగించుకునేలా వ్యూహం రూపొందిస్తోంది. టీడీపీ వంశీపై వేటు వేస్తుందేమోనని వైసీపీ ఆసక్తిగా చూస్తోంది. కానీ ప్రస్తుతానికి టీడీపీ అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే.. వంశీ టీడీపీకి రాజీనామా చేసి శాసనసభలో తటస్థ సభ్యుడిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పార్టీ మార్పుపై వంశీ తన అనుచరులకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. సీఎం జగన్‌ని కలిసి వచ్చిన తర్వాత వంశీ అనుచరులు నియోజకవర్గంలో పలువురు టీడీపీ నేతలకు ఫోన్లు చేసి రాజీనామాలు చేయాలని కోరారు. దీంతో కొందరు టీడీపీకి రాజీనామా కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో వంశీ తిరిగి సందిగ్ధంలో పడటంతో నియోజకవర్గంలోని వంశీ అనుచరగణంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు వర్గం మాత్రం..వంశీ వైసీపీలో చేరే అవకాశల్లేవని ప్రచారం చేస్తోంది. వంశీ రాకపై సీఎం జగన్‌ సానుకూలంగా లేరని వారు ప్రచారం చేస్తున్నారు.

వంశీ సీఎం జగన్‌ని కలిసొచ్చిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావు వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. వంశీని పార్టీలో చేర్చుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధిష్ఠానం వంశీని చేర్చుకోవడంపై పునరాలోచనలో పడిందని వెంకట్రావు వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు వెంకట్రావుకు ఇప్పటికే హైకమాండ్‌ నుంచి ఎటువంటి ఆందోళన చెందవద్దని సందేశం అందినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో గన్నవరం రాజకీయం మరికొన్ని రోజులపాటు ఉత్కంఠ రేపే అవకాశం కనిపిస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...