Sunday, July 25, 2021

Latest Posts

తమిళ పవర్‌ స్టార్‌తో వనిత నాలుగో పెళ్లి చేసుకుందా!

Vanitha Viajykumar Fourth Marriage

వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి వనిత విజయ్‌కుమార్‌. ఈమె పెళ్లి గురించి వార్తలో ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె నాలుగో వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్‌ నటుడు విజయ్‌, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. ఈమె ‘చంద్రలేఖ’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆమె తమిళ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొని తరచూ వార్తల్లో నిలిచింది. అయితే ఆమె త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ జ్యోతిష్యుడు జోస్యం పలికిన వీడియో ఒకటి ఆ మధ్య తెగ వైరల్‌ అయింది. వనితతో ఏడడుగులు నడిచే వ్యక్తి పేరు ‘S’ అక్షరంతో మొదలవుతుందని అతడు హింట్‌ కూడా ఇచ్చాడు. అంతేకాక ఆమె రాజకీయాల్లోకి కూడా ఎంటరవుతుందని, దివంగత సీఎం జయలలితలా పాలిటిక్స్‌లోనూ తన సత్తా చాటుతుందని పేర్కొన్నాడు.

ఇప్పుడా ఆ మాటలను నిజం చేస్తూ వనిత పెళ్లి ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసి అభిమానులకు షాకిచ్చింది. తమిళ పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న ఫోటోను ఆమె సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. అయితే ఆ ఫోటోకు క్యాప్షన్ ఏమీ లేకపోవడంతో ఆమె నిజంగా పెళ్లి చేసుకుందా? అని కొందరు అభిమానులు అయోమయానికి లోనయ్యారు. అయితే ఇది నిజమైన పెళ్లి కాదట, ప్రస్తుతం తను చేస్తున్న ఓ సినిమాలోని ఫోటో అని టాక్.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss