Ram Gopal Varma Sensational Comments On Pawan Kalyan’s Vakeel Saab Movie First Look:
నిత్యం వార్తల్లో ఉండే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీపై సెటైర్లు వేసాడు. పవన్ వర్సెస్ ఆర్జీవీ ఎపిసోడ్స్ గతంలో ఎన్నో ఉన్నాయి. పవన్ కి సంబంధించిన ఏ విషయం అయినా సరే,ఆర్జీవీ సెటైర్ పడాల్సిందే. తాము తక్కువ తినలేదన్నట్లు పవన్ ఫ్యాన్స్ అంతే ధీటుగా స్పందిస్తుంటారు. ఇక తాజాగా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పై ఆర్జీవీ వేసిన సెటైర్ హాట్ టాపిక్ అయ్యింది. జనసేన వ్యవహారాలతో రాజకీయంగా బిజీగా ఉంటూనే పవన్ కల్యాణ్ నటిస్తున్న `వకీల్ సాబ్` ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ అంచనాల నడుమ విడుదలైంది.
ఈ లుక్ పీకే అభిమానుల్లో వైరల్ అయినా కామన్ జనాల్లో మాత్రం మిశ్రమ స్పందనే వ్యక్తమైంది. వకీల్ సాబ్ ఇలా ఉన్నాడేంటి? పవన్ పాత్రను కమర్షియలైజ్ చేసేశారా? పింక్ కి కానీ, అజిత్ రీమేక్ తో కానీ ఏమాత్రం సంబంధం లేని పోస్టర్ వేశారే! అంటూ సందేహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఫస్ట్ లుక్ పై ఇతరుల్లా ముఖస్తుతికి పొగడ్తలకు వెళ్లని దర్శకుడు ఆర్జీవీ యథావిధిగా తనదైన శైలిలో పంచ్ వేశారు. `వకీల్ సాబ్` ఫస్ట్ లుక్ ని అన్నారా.. లేక తనని తాను అనుకున్నారా? అన్నట్టుగా ఓ పోస్టర్ ని డిజైన్ చేసి ఆర్జీవీ వదిలాడు.
అచ్చం పవన్ లానే తాను ఓ డైరెక్టర్ చైర్ పై కూర్చొని ఉన్న ఫోటోకి `డైరెక్టర్ సాబ్` అనే టైటిల్ ని జాయింట్ చేసి ఫోజిచ్చాడు. ఆ ఫోటోకి `వకీల్ సాబ్` ఫస్ట్ లుక్ ని జత చేశాడు. “నేను కొందరు ఇడియట్స్ గురించి ఆలోచించను.. ఇలాంటి ఇడియట్ పనులను చేయను“ అంటూ ఆ ఫోటోతో పాటు సెటైరికల్ వ్యాఖ్యతో వేడెక్కిస్తూ, ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ అసలు పవన్ ని ఉద్ధేశించి అన్నదేనా? ఏదో ఫ్లోలో అలా అన్నాడా ? అనేది తెలీడం లేదు. ఇక ఈ ట్వీట్ చూసిన పవన్ ఫాన్స్ వర్మపై గుర్రుగా ఉన్నారు.