Thursday, December 2, 2021

Latest Posts

దీపావళికి పంచ్ ఇవ్వనున్న వరుణ్ తేజ్ ‘గని’

Varun Tej Ghani Movie release date fix

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా ”గని”. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని పోస్టర్స్ ను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తున్నట్లుగా కొద్ది సేపటి క్రితమే ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా జులై 30 2021 న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా థియేటర్లు మళ్లీ మూతపడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss