Thursday, May 13, 2021

Latest Posts

మెగా బయోపిక్ పై చేతులెత్తేసిన వరుణ్ …..

బయోపిక్స్ కాలం కదా. ప్రముఖుల బయోపిక్స్ లు తెరకెక్కుతున్నాయి. అయితే  మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కిస్తే అందులో ఎవరు నటిస్తారు? అని ప్రశ్నిస్తే సాయి తేజ్ కానీ, వరుణ్ తేజ్ కానీ నటిస్తే బావుంటుందన్న అభిప్రాయం ఫ్యాన్స్ లో ఉంది. అంతేకాదు అలాంటి అవకాశం వస్తే అందుకు తాము సిద్ధమేనని అయితే చరణ్ అయితే ఇంకా బావుంటుందని  సాయి తేజ్.. వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

అయితే  `ప్రతి రోజు పండగే` ప్రమోషన్లో సాయి తేజ్ ని  మెగాస్టార్ బయోపిక్ తెరకెక్కిస్తే మీరు నటిస్తారా? అనే ప్రశ్న వచ్చింది.  తాను మెగాస్టార్ జీవితకథకు న్యాయం చేయలేనని సాయి తేజ్ చేతులెత్తేశాడు.  మెగాస్టార్ పాత్రలో రామ్ చరణ్ అయితేనే పర్ఫెక్ట్ అనేశాడు.  సాయి తేజ్ ఇలా అనేయడంపై  అభిమానుల్లో అనుమానం  నెలకొంది.  విమర్శలు  పెద్ద స్థాయిలో ఉంటాయని సాయి తేజ్ వెనక్కి తగ్గాడా? చరణ్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఆ కామెంట్ చేశాడా? అన్న చర్చా సాగుతోంది. ఇకపోతే యంగ్ సాయి తేజ్ లో సుప్రీం హీరో చిరంజీవి కనిపిస్తాడని మెగా ఫాన్స్ భావిస్తుంటారు.

ఎందుకంటే, మెగాస్టార్ రీమిక్స్ పాటల్లో తను ఒదిగిపోయినంతగా ఇంకెవరూ ఒదిగిపోలేరు. ఇక ఎనర్జిటిక్ డ్యాన్సల్లోనూ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ ని చూపించడంలోనూ సాయి తేజ్ తర్వాతనే. మరి అతడు తాను చేయనని అంటూనే,  చరణ్ మాత్రమే చేయాలని అంటున్నాడు. నిజానికి  చిరంజీవి బయోపిక్ తీసే ఆలోచన లేదని చరణ్ ఇంతకుముందు అన్నారు. ఒకవేళ తీసినా అందులో చరణ్ .. సాయి తేజ్ లలో ఎవరో ఒకరు నటిస్తే బావుంటుందని ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss