Thursday, December 2, 2021

Latest Posts

రాజ్యసభలో కంటతడి పెట్టుకున్న వెంకయ్య నాయుడు

Venkaiah Naidu Gets Emotional For Ruckus

రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం ఎంపీలు టేబుల్‌ పైకి ఎక్కి, కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఫైళ్లు విసిరడం పట్ల ఆయన కంట తడి పెట్టుకున్నారు. ఆ దృశ్యాలను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో కలవరపెట్టే సంఘటనలపై తాను నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు.

సభలో విపక్షాల ప్రవర్తన ప్రజాస్వామ్యం పై దాడి అని వెంకయ్య పేర్కొన్నారు. రాజ్యసభలో రచ్చలను రికార్డ్ చేయడం మరియు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం, కొంతమంది ప్రతిపక్ష నాయకులతో పాటు, ఎంపీ లు కూడా వెంకయ్యను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss