కలియుగ పాండవులు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. తాజాగా వెంకీ పుట్టినరోజు సందర్బంగా భారీ వెంకీ మామా మూవీ విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మొదటి మూడు రోజుల్లో 30.5 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది. విభిన్న పాత్రలతో వెంకీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వెంకీ తన ఫ్యామిలీ గురించి బయటకు పొక్కకుండా చాలా లో ప్రొఫైల్ లో ఉంటాడు. వెంకీ ఇంటికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
డాక్టర్ డి. రామానాయుడుతో కల్సి ఫిలిం నగర్ లో వుండే వెంకీ ఆతర్వాత మణికొండలో సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. డాలర్ హిల్స్ సమీపంలోని కొత్తింట్లోకి బాడీగార్డ్ షూటింగ్ టైంలో షిఫ్ట్ అయ్యాడు. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంటుంది. అప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవి ఇల్లు అందరికన్నా పెద్దదిగా ఉండేది. అయితే అందరికన్నా పెద్ద ఇల్లు ఇప్పుడు వెంకీదే. బాలివుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కి పోటాపోటీగా ఈ ఇల్లు ఉంటుంది.
సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ ఇల్లు వెంకీ భార్య నీరజకు చాలా ఇష్టంగా కట్టారట. జిమ్,గ్రాండ్ స్విమ్మింగ్ పూల్ ,ఎంతమంది ఇంటికి వచ్చినా ఇబ్బంది లేకుండా ఏకంగా 16బెడ్ రూమ్స్ ఉన్నాయట. ఫామిలీ అందరూ ఇంట్లోనే సినిమా చూసి ఆనందించడానికి మినీ థియేటర్ ఉందట. కాలుష్యం లేకుండా పెద్ద గార్డెన్ తీర్చిదిద్దారట. అయితే వెంకీ రెండో కూతురు భావన సినిమాల్లోకి ఎంటర్ అవుతోందని ఎప్పటినుంచో టాక్ నడుస్తుండగా, వెంకీ వారసుడిగా అర్జున్ కూడా సినీ రంగంలోకి వస్తాడని కూడా టాక్ ఉంది. అందుకే వీళ్ళ డాన్స్ వంటివి ప్రాక్టీస్ చేసుకోడానికి మినీ ఫ్లోర్ రెడీ చేసారు. వెంకీ ఫ్యామిలీలో 6సభ్యులు ఉండగా, దగ్గుబాటి ఫామిలీ కూడా ఇక్కడే పండగలు అవీ చేసుకుంటారట.