ఐపిఎస్ అధికారి ఏబి వెంక్తటేశ్వర రావు పై సస్పెన్షన్ ను ఎత్తివేయ్యాలని హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. తన సస్పెన్షన్ ను క్యాట్ ఎత్తివెయ్యకపోవడంతో ఏబి వేంకటేశ్వర రావు హై కోర్ట్ ను ఆశ్రయించగా క్యాట్ ఆదేశాలను పక్కనపెట్టి విధుల్లోకి తీసుకోవాలని తీరుపునివ్వడం జరిగింది. కాగా పూర్వం ఆంధ్ర ప్రదేశ్ రక్షణ కొనుగోళ్లలో ఏబి వెంక్తటేశ్వర రావుఅక్రమాలకు పాల్పడ్డారని అతనిని ఏపి ప్రభుత్వం సస్పెండ్ చెయ్యడం జరిగింది.
మాజీ ఏపి ఇంటెలిజెన్స్ అధికారి అయిన ఏబి వెంకటేశ్వర రావు పూర్వం రక్షణ సామాగ్రి కొనుగోలులో అవకతవకల కారణంగా ఈయన్ని ఏపి ప్రభుత్వం సస్పెండ్ చెయ్యడం జరిగింది. తరువాత అతనిపై సమగ్ర విచారణ జరపాలని కూడా ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది. అయితే తరువాత ఈయన క్యాట్ ను ఆశ్రయించగా వాధ ప్రతివధానాలను విన్న క్యాట్ సస్పెన్షన్ లో ఎటువంటి మార్పు చేయలేదు. దీనితో హై కోర్ట్ ను ఆశ్రయించిన ఏబి వెంక్తటేశ్వర రావు సస్పెన్షన్ ను కోర్ట్ ఎత్తివెయ్యడం జరిగింది.
ఇది కూడా చదవండి: