Tuesday, May 18, 2021

Latest Posts

కరోనా రోగులకు వీడియో కాల్ సౌకర్యం

Video Call Facility for Corona Patients

కరోనా మహమ్మారి సోకి ఆసుపత్రులలో చేరి,ఐసోలేషన్ లలో ఉంటున్న వాళ్ళ దగ్గరికి ఫామిలీ మెంబర్స్ ఎవరినీ అనుమతించని కారణంగా మానసికంగా దెబ్బతింటున్నారు. దీన్ని గుర్తించిన అహ్మదాబాద్ నగరంలోని సివిల్ ఆసుపత్రిలో క్వారంటైన్‌లో ఉన్న కరోనా రోగులకు తీపి కబురు అందింది. ఐసోలేషన్ గదుల్లో ఉన్న కరోనా రోగులు వారి కుటుంబసభ్యులతో వీడియో కాల్ లో మాట్లాడేందుకు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వైద్యులు అంగీకరించారు.

దీంతో కరోనా రోగులు వీడియో కాల్ లో తమ కుటుంబసభ్యులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు దూరంగా క్వారంటైన్ లో ఉన్న కరోనా రోగులకు వీడియో కాలింగ్ సౌకర్యం కల్పించడంతో వారు తమ కుటుంబసభ్యులను వీడియోల్లో చూసి మాట్లాడి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,428కి చేరగా ,290 మంది మరణించారు.
కాగా కరోనా మహమ్మారి తాజాగా మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటరుకు సోకింది. దీంతో ఆమెను దక్షిణ ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. మహిళా కార్పొరేటర్ పరిస్థితి మెరుగ్గానే ఉండగా, ఆమె భర్తకు కూడా కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఇద్దరూ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. మొదట కస్తుర్బా ఆసుపత్రికి తరలించి ,అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss