Home సినిమా వార్తలు నయా హీరో విజయ్ దేవర కొండ బర్త్ డే

నయా హీరో విజయ్ దేవర కొండ బర్త్ డే

Vijay devarakonda Birth Day

వాట్స్ అప్ వాట్స్ అప్ మై రౌడీ బాయ్స్ అంటే చాలు ఇప్పుడు యూత్ లో వినిపించే పేరు విజయ్ దేవరకొండ. తన ట్రెండీ మిడిల్ క్లాస్ చిల్ బెహేవియర్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నయా స్టార్. ఎవడే సుబ్రహ్మణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం “పెళ్లి చూపులు”తో విజయ్ తెలుగు ప్రేక్షకుల కు చేరువయ్యాడు. శేఖర్ ఖమ్ముల హ్యాపీ డేస్ తర్వాత చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ కొట్టచ్చని రొమాంటిక్ కామిడీ గా తెరకెక్కిన”పెళ్లి చూపులు” సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్, ఫీచర్ తెలుగు కేటరెగీ లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సాదించి ప్రూవ్ చేసింది. లైఫ్ ఈస్  బ్యూటీఫుల్ సినిమాలో యరగేన్సీ రిచ్ కిడ్ క్యారెక్టర్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఎవడే సుబ్రహ్మణ్యం లో జీవితాన్ని పూర్తిగా అర్దం చేసుకున్న మోడ్రన్ కుర్రాడు క్యారెక్టర్ లో నటించినా, పెళ్లి చూపులు సినిమాతో పక్కింటి కుర్రాడు అని తెలుగు ప్రేక్షకులకు చేరువయిన ఈ సినిమాల తర్వాత విజయ చేసిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినీ ఇండస్ట్రిలో ఒక సంచలనం అయ్యింది.

విజయ్ దేవరకొండను అమాంతం స్టార్ ని చేసింది సినిమా, “అర్జున్ రెడ్డి”తో అప్పటి వరకు అప్కమింగ్ స్టార్ గా ఉన్న విజయ్ ఇమేజ్ ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఈ సినిమాతో  విజయ్ కెరీర్ గ్రాఫ్ టాప్ కి చేరింది. సందీప్ రెడ్డి వంగా తీసిన డార్క్ హార్డ్ ఎమోషనల్ లవ్ స్టోరీ “అర్జున్ రెడ్డి” తెలుగు సినీ జనాలను చాలా బాగా అలరించింది. ఈ సినిమాలో విజయ్ నటనకు తెలుగు సినీ జనాలు దాసోహం అయిపోయారు. ఎన్నో విమర్శలు “అర్జున్ రెడ్డి” మూవీ కి ఎదురైన అవన్నీ ఈ సినిమా మీద క్రేజ్ పెంచాయి.ఈ సినిమా నుంచి మొదలయిన విజయ్ దేవరకొండ హవా కాదు కాదు ఈ ROWDY హవా తన ఫన్ బేస్ కు  బలంగా  పునాది పడింది రెండు తెలుగు ప్రేక్షకుల్లో. అంతే ఈ క్రేజ్ ఆ తర్వాత వచ్చిన “గీతా గోవిందం” సినిమాతో పీక్స్ కి చేరింది. “గీతా గోవిందం” ముందు కొంత సినిమా పైరసీ వల్ల బయటకొచ్చిన రిలీస్ తరువాత 100 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఎంతెల అంటే మెగా స్టార్ చిరంజీవి ఆ ఆడియో వేడుకలో విజయ్ ని “వెల్కమ్ టు ద స్టార్ క్లబ్” అన్నంత.

ఈ సినిమాతో విజయ్ ని వంద కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టింది కూడా. పరశురామ్ దర్శ్కత్వంలో నటించిన విజయ్ “గీతా గోవిందం” సినిమాతో ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఆక్టర్ అవార్డ్ ని కూడా పొందాడు.”గీతా గోవిందం” తో అటు ఫ్యామిలి ఇటు యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ తన ఫస్ట్ వెంచర్ ROWDY వేర్ క్లోత్స్ బ్రాండ్ లాంచ్ చేశాడు.అలాగే “కింగ్ ఒఫ్ ద హిల్” అనే ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి తనకు హీరోగా ఛాన్స్ ఇచ్చిన పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా “మీకు మాత్రమే చెప్తా” అనే మూవీ కూడా తీశాడు. తన సామాజిక భాద్యతగా “దేవరకొండ ఫౌండేషన్” ను ప్రారంబించి తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ కరోనా సమయంలో కూడా మద్య తరగతి ప్రజలు నిత్యవసరాల వస్తువులు కొనుగోలు చేస్తే తాను తీసుకున్న డొనేషన్స్ ద్వారా ఆ బిల్ల్స్ ను ఈ ఫౌండేషన్ ద్వారా పే చేస్తున్నాడు. కాగా  ఈ డొనేషన్స్  నిన్నటికి  1 కోటి రూపాయలకు చేరిందని విజయ్ తెలియజేశాడు. అల మొదలయిన తన స్టార్ కెరీర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ పూరీతో  ఫ్యాన్ ఇండియన్ మూవీ చేసేంత క్రేజ్ కొనసాగుతూ ఉన్న విజయ్ దేవరకొండ బర్త్ డే ఈ రోజు, సొ లెట్స్ విష్ హిమ్ టుగెదర్.. హాపీ బర్త్ డే రౌడీ.

Exit mobile version