Saturday, February 27, 2021

Latest Posts

ఫేక్ వార్తలను నమ్మొద్దు అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda fire

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ నిన్న తన సోషల్ మీడియా అక్కౌంట్ లో ఒక వీడియొను పోస్ట్ చేశారు. తీర చూస్తే ఇది అందరికీ షాక్ ఇచ్చే అంశం కావడం విశేషం. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ లో ఫేక్ న్యూస్ రాసే కొన్ని వెబ్ సైట్స్ ను ఉతికి ఆరేశారు. కాగా అందరినీ తిట్టడం నా ఉద్దేశం కాదని, ఎవరైతే ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తారో వారిని మాత్రమే అంటున్నా అని సినీ జర్నలిస్ట్ లకు, మిగిలిన కంటెంట్ రైటర్స్ కు ముందుగానే క్షమాపణ చెప్పారు.

కొన్ని వెబ్ సైట్స్ లో తన గురించి తప్పుగా రాయడం కాకుండా, తన విజయ్ దేవరకొండ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు కూడా తప్పుడు సమాచారంతో ఆయా వెబ్ సైట్స్ రాయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్త్రం చేశారు. అయితే విజయ్ తను ఒక చారిటి పెట్టి దానికి అందరినీ డొనేషన్స్ పంపించాలని కోరాడు, వచ్చిన మొత్తాన్ని తను ఎలా మిడిల్ క్లాస్ వారికి అందించాలనుకుంటున్నాడో ఒక వెబ్సైట్ ద్వారా అందరికీ తెలిపాడు. కాగా ఆ వెబ్ సైట్స్ లో ఆర్ధిక సహాయం కోసం అప్లై చేసుకున్నా వారికి నిత్యవసర సరుకులు పంపడం ఈ చొరవకు ముఖ్య ఉద్దేశ్యం అని, కాగా వీళ్ళు ఇవేవీ పట్టించుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం పై తనదైన శైలిలో ఎండగట్టారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss