Sunday, June 20, 2021

Latest Posts

ఈ ఫీట్ సాధించిన మొదటి సౌత్ హీరో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Followers In Instagram

విజయ్ దేవరకొండ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరో గా మారాడు. తక్కువ వ్యవధిలోనే, దేశంలో ట్రెండింగ్ స్టార్ గా మారాడు ఈ హీరో. అయితే అతని విజయం వెనుక చాలా కృషి ఉందని మర్చిపోకూడదు. తాజాగా,ఈ అర్జున్ రెడ్డి తన కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు.

విజయ్‌కు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఒక సోషల్ మీడియా అక్కౌంట్ లో 12 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగి ఉన్న మొదటి దక్షిణ భారత దేశ నటుడి గా మారాడు.  విజయ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా మాత్రం క్రేజీ ఫాలోయింగ్ పొందుతున్నాడు.

అతను చివరిసారిగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం తన రాబోయే చిత్రం లైగర్ పనులతో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్  అనన్య పాండే విజయ్ కి జోడీగా నటిస్తుంది.

ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9 న తెరపైకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. అయితే దేశంలో కొనసాగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఇది వాయిదా పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss