Vijay Devarakonda New Concerns During This Lockdown
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇక భారత్ లో మూడు వారాలపాటు లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అందరూ ఇంటికి పరిమితం అయ్యారు. దీంతో ఇక అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. సినిమా వాళ్ళు కూడా ఖాళీ అయ్యారు. ఎవరి కష్టాలు వారివి అన్నట్లుగా ఉంది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో సినిమా చేస్తూ,లాక్ డౌన్ తో షూటింగ్ కేన్సిల్ అయి ఇంటిపట్టునే ఉంటున్న విజయ్ దేవరకొండ కొత్త కష్టాలు వచ్చిపడ్డాయట
సినిమా వాళ్ళు అందరూ ప్రజల్లో కరోనా పట్ల చైతన్యం కల్పిస్తూ తమవంతు సాయం చేస్తున్నారు.
అలాగే కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటోందో వివరిస్తూ వీడియోస్ ద్వారా ప్రజలకు చేరువగానే ఉంటున్న విజయ్ ని … కరోనా బాధితులకు విరాళం ఇవ్వలేదన్న సాకుతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా పూరి మూవీ కోసం కండలు పెంచిన విజయ్ షూటింగ్ ఆగిపోవడంతో కొత్త కష్టాన్ని ఎదుర్కొంటున్నాడట.
అయితే లాక్ డౌన్ తో జిమ్ లాంటివి మూతపడడంతో సిక్స్ పాక్ ఎలా కొనసాగించాలా అని విజయ్ దేవరకొండ తెగ తపించేస్తున్నాడు. చాలామందికి ఇళ్లల్లో జిమ్ లు ఉన్నా, కొత్తిల్లు కారణంగా విజయ్ కి జిమ్ లేదు. ఇలా అయితే ఫిట్ నెస్ తేడా వచ్చి షూటింగ్ మళ్ళీ వాయిదా పడుతుందేమోనని బాధ పడుతున్నాడు. షూటింగ్ జరిగే వరకూ సిక్స్ పాక్ ని మెయింటేన్ చేయాల్సి ఉంది.