Vijay Devarakonda Next Movie
ఏ హీరోకైనా హిట్స్ ఉన్నంతవరకే క్రేజ్. తేడా వచ్చిందో మొత్తానికే ప్రమాదం అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితి అదే. నిజానికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అనూహ్యంగా ఇతడికి క్రేజ్ ఉందంటే ,ఖచ్చితంగా అర్జున్ రెడ్డి మూవీయే కారణమని అంటారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రతో టాలీవుడ్ లో స్టార్ గా నిలిచాడు. దాని తర్వాత గీత గోవిందంతో మరో విజయాన్ని విజయ్ సొంతం చేసుకున్నాడు.
గీత గోవిందం చిత్రం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కమర్షియల్ సక్సెస్ విజయ్ అందుకోలేకపోయాడు. ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పనవ్వలేదు. దీంతో మరో ఫ్లాప్ ఖాతాలో వచ్చిచేరింది. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ క్రేజ్ కంటిన్యూ అవ్వాలి అంటే అర్జున్ రెడ్డి తరహా మాంచి కమర్షియల్ హిట్ ఒకటి పడాలి. ఆ హిట్ కోసం విజయ్ దేవరకొండ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. పూరితో మూవీ అంటే జూదమే. అది ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే ఖచ్చితంగా సక్సెస్ ఇస్తాడనే నమ్మకంతో మళ్లీ సందీప్ వంగతోనే సినిమా చేయాలని ఈ రౌడీ స్టార్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ చేసిన సందీప్ ఆతర్వాత చిత్రం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది వర్కౌట్ కాలేదు. పలువురు హీరోలు ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి గా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం సందీప్ రెడ్డికి డేట్లు ఎవరు ఇవ్వలేదు. దాంతో తెలుగు హీరోతో తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమా తీయాలని సందీప్ భావిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా టీ సిరీస్ బ్యానర్ లో సందీప్ సినిమా మొదలు పెట్టబోతున్నాడట. లైగర్ చిత్రం తర్వాత ఈ సినిమా ఉండొచ్చు. అర్జున్ రెడ్డిని మించి ఈ సినిమా ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నా,ఈ మూవీపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.