Sunday, June 20, 2021

Latest Posts

నిర్మాతగా దూకుడు చూపిస్తున్న లైగర్

Vijay Devarakonda To Produce Two Movies

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక పెను సంచలనం గా మారాడు. అయితే తరువాత కొన్ని ఫ్లాప్స్ రావడంతో కాస్త దూకుడు తగ్గించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ పూరీ జగన్నాధ్ సినిమాతో లైగర్ గా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది మరియు ఈ సినిమాని పాన్ సినిమా ఇండియా గా తెరకెక్కిస్తున్నాడు పూరీ.

అయితే చాలా మంది హీరోలు కాస్త సీనియర్ హీరో లుగా మారక నిర్మాతలుగా మారుతారు. ఎందుకంటే నిర్మాణంలో బోలెడు రిస్క్ ఉంటుంది కాబట్టి. సినిమాని నిర్మించడం ఒక ఎత్తెయితే, దానిని బిజినెస్ చేయడం మరో ఎత్తు. అందుకే సినిమాలను నిర్మించడంతో ఎవరైనా ఆచితూచి అడుగేస్తుంటారు. కానీ ఈ విషయంలో విజయ్ దేవరకొండ తనదైన దూకుడు చూపిస్తున్నాడు. విజయ్‌ సొంతంగా ‘కింగ్ ఆఫ్ ది హిల్’ పేరుతో బ్యాన‌ర్ స్టార్ట్ చేసి ఇప్పటికే ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీని నిర్మించాడు.

తాజాగా తన ప్రొడక్షన్‌ హౌస్ లో మరో రెండు సినిమాలను నిర్మించేందుకు సిద్దమయ్యాడు ఈ యంగ్ హీరో. తన సోదరుడు ఆనందర్‌ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. అలాగే ఈ మూవీతో పాటు డెబ్యుట్ దర్శకుడు పృథ్వీసేనతో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం మొత్తం అందరినీ కొత్త వారిని పరిచయం చేయాలని చూస్తున్నాడు విజయ్. త్వరలోనే ఈ సినిమా కూడా రెగ్యులర్ షూటింగు ప్రారంభించాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss