Monday, July 26, 2021

Latest Posts

బాలీవుడ్ హీరో కి ఫ్యాన్ బాయ్ గా మారిపోయిన విజయ్

Vijay Fanboy Moment For Bollywood Hero

తమిళ స్టార్ హీరో విజయ్ కి దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. అతనిని చూడడానికి ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. తనని ఒక్కసారైనా కలవాలని ఎంతో ఆశపడతారు. అయితే ఇలాంటి స్టార్ హీరో కి ఒక బాలీవుడ్ హీరో ని చూస్తే చిన్న పిల్లాడిలా మారిపోతాండట. అతనే బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌.

ఈ హీరో సినిమా భాగి 3 చూడటానికి థియేటర్ కి వెళ్లాడంట విజయ్. ఈ విషయాన్ని విజయ్ తో కలిసి సినిమా చేసిన మాళవిక మోహనన్ చెప్పింది. నేను, తలపతి మరియు ఇతర తారాగణం, సిబ్బంది థియేటరలో టైగర్ ష్రాఫ్ యొక్క భాగి 3 ని చూడటానికి వెళ్ళాము. సినిమా జరుగుతుండగా ఒక యాక్షన్ సన్నివేశంలో, టైగర్ ష్రాఫ్‌ను తెర పై చూస్తూ విజయ్ తలైవా అంటూ అరిచాడు,అని మాళవిక వెల్లడించారు. ఆ సీన్ చూసి విజయ్ ఒక ఫ్యాన్ బాయ్ గా మారిపోయినట్లు అనిపించందని అన్నారు.

టైగర్ ష్రాఫ్ యాక్షన్ స్టంట్స్ చేయడం చూసి తాను ఆనందిస్తానని విజయ్ తనతో చెప్పాడని మాళవిక తెలిపారు.టైగర్ ష్రాఫ్ యొక్క బాడీ, స్టంట్స్ మరియు నటనకి అతనికి ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అతనికి తలపతి విజయ్ రూపంలో స్టార్ అభిమాని ఉన్నట్లు తెలుస్తోంది.

నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ బీస్ట్ లో విజయ్ కనిపించనున్నాడు. ఈ చిత్రం వచ్చే జనవరి థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss