Tuesday, April 13, 2021

Latest Posts

విజయ్ మాల్యాకు లండన్ కోర్ట్ షాక్

VIJAY MALYA GOT SHOK BY UK COURT :

పరిచయం అవసరం లేని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు లండన్ కోర్ట్ షాక్ ఇచ్చింది. విజయ్ మాల్యాను ఇండియా కు అప్పగించవలసిందిగా 2018 లోనే తీసుకున్న కోర్ట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాల్యా వేసిన పిటీషన్ ను లండన్ కోర్ట్ సోమా వరం కొట్టివేసింది. లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఇద్దరు సభ్యుల ధర్మాసనం లార్డ్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్,  జస్టిస్ ఎలిజబెత్ లాంగ్ మాల్యా అభ్యర్థనను తిరస్కరించింది.

భారతీయ బ్యాంకు లకు సుమారు 9 వేల కోట్లు ఎగవేసినందుకు, విజయ్ మాల్యా 2016 లో లండన్ పారిపోయారు. మనీలాండరింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చార్జ్ షీట్లను దాఖలు చేశాయి. మాల్యాకు చెందిన ఆస్తులను ఇప్పటికే ఎటాచ్ చేశాయి. మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం. విచారణనిమిత్తం అతణ్ని ఇండియాకు తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ వాదనను సమర్థించిన బ్రిటన్ పోలీసుల సహకారంతో 2017 ఏప్రిల్‌లో మాల్యాను లండన్‌లో భారత అధికారులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే 2018 డిసెంబర్‌లోనే విజయ్ మాల్యాను అప్పగించాలని యుకె కోర్టు ఆదేశించింది.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss