Vijay Sethupathi has walked out of Allu Arjun’s Pushpa team
చిరంజీవి ‘సైరా’ సినిమాతో తెలుగులో సుపరిచుతుడైన విజయ్ సేతుపతి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాలో మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప’ లో కూడా కీలక పాత్రలలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే అల్లు అర్జున్, పుష్ప’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సేతుపతి కనిపిస్తునట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డేట్లు సర్దుబాటు కాకపోవడమే దీనికి కారణం అని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆయన స్థానంలో అరవింద్ స్వామి, బాబీ సింహ, సునీల్ శెట్టి పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.