Sunday, June 20, 2021

Latest Posts

భారీ రేంజ్ లో విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్

Vijay Sethupathi Remuneration
తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ఉప్పెన సినిమాతో తెలుగులో కూడా మంచి పేరును సంపాదించాడు. తన సినిమాలు, నటనతో జనాలకు పూనకం తెప్పించే ఈయన తాజాగా టీవి హోస్ట్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. సన్‌ టీవీలో ప్రసారమయ్యే మాస్టర్‌ చెఫ్‌ తమిళ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు సన్‌ టీవీ ఇటీవలే ఓ ప్రోమోను కూడా రిలీజ్‌ చేసింది.

అయితే మాస్టర్‌​ చెఫ్‌ ని హోస్ట్ చేసేందుకు విజయ్ కి ఎంత పారితోషకం ఇచ్చారనేది ప్రేక్షకుల సందేహం. విజయ్ ని ఈ షో కి రప్పించేందుకు నిర్వాహకులు భారీ పారితోషికం ఆశ చూపారట. ఇది తను సినిమా కోసం తీసుకునేదాని కన్నా ఎక్కువగా ఉండటంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది ఎంత మొత్తం అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

ఇక 2014లోనే ఈ తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్‌ దృష్ట్యా అతడి పారితోషికం స్టార్‌ హీరోలతో సమానంగా ఉండే అవకాశం ఉంది. గతంలోనూ ఆయన ఇదే సన్‌ టీవీలో నామూరు హీరో అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తాజాగా ఆయన నటించిన ‘విజయ్‌ సేతుపతి’ సినిమా ఆహాలో ఈ రోజు నుంచి నుంచి ప్రసారం కానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss