Tuesday, April 13, 2021

Latest Posts

టిడిపికి కన్నా అమ్ముడుపోయారంటున్న విజయసాయి 

Vijaya Sai Reddy Reacts On Kanna Lakshmi Narayana Comments

ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోపక్క రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు సరికదా ఇంకా శృతిమించిపోతోంది. అధికార వైసిపి,టిడిపి,బిజెపి నేతల నడుమ సాగుతున్న ఈ విమర్శల పరంపర పట్ల పలువురు ఆవేదన చెందుతున్నారు. అందరూ ఒక్కటై పనిచేయాల్సిన సమయంలో ఈ రాజకీయాల గోలేమిటని విస్తుపోతున్నారు. తాజాగా వైసిపి ప్రభుత్వ తీరుపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించగా, కన్నా  రూ.20 కోట్లకు చంద్రబాబుకి అమ్ముడు పోయారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఆరోపించారు.

విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి  మీడియాతో మాట్లాడిన సందర్భంలో   కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు సైతం విమర్శిస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా విజయసాయిరెడ్డి తీవ్రంగా  స్పందించారు. కన్నా టిడిపికి అమ్ముడు పోయారని, ఈ  వ్యవహారంలో బీజేపీకే చెందిన సుజనాచౌదరి మధ్యవర్తిగా వ్యవహరించా రని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర నాయకత్వం ఆమోదం లేకుండా కన్నా లక్ష్మీనారాయణ పిచ్చిగా మాట్లాడుతున్నారని విజయసాయి విమర్శించారు. కరోనాపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారని, గుర్తుచేశారు.

అయితే  ఇక్కడ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా రాజకీయం చేస్తున్నారని విజయసాయి  విమర్శించారు. కరోనా నియంత్రణలో భాగంగా లక్ష ర్యాపిడ్‌ కిట్లు రాష్ట్రానికి దిగుమతి చేసుకున్నామని, వాటిలో ఐదు వేల కిట్లు విశాఖ పంపించి, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ర్యాపిడ్‌ పరీక్షలు చేయిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ కిట్ల రేటుపైనా పచ్చ మాఫియా ఏడుపు మొదలు పెట్టిందన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss