Vijaya sai reddy Shocking Comments on Election Commissioner
అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల కమీషనర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. కరోనా కంటే అత్యంత ప్రమాదకారి నిమ్మగడ్డ రమేష్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వైరల్ అయ్యాయి.
నిజానికి ఆయన నిమ్మగడ్డ రమేష్ కాదని, నారావారి రమేష్ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శునకాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో.. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్‌గా అదే పనిచేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రభుత్వంలో ఎవరినీ సంప్రదించకుండా.. అభిప్రాయాలు తీసుకోకుండా, నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారని ఆయన మండిపడ్డారు.
రమేష్ దృష్టిలో టీడీపీ ఒక్కటే రాజకీయపార్టీనా.. వైసీపీ కాదా? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అజెండా ప్రకారం కులపిచ్చివాడిగా.. ఎల్లో సూసైడ్ స్క్వాడ్ మెంబర్‌గా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ సిగ్గుంటే నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ను.. నారా వారి గబ్బిలం అని పిలిస్తే బాగుంటుందని ఆయన అనడం ఆశ్చర్యం కల్గించింది.