Thursday, December 2, 2021

Latest Posts

నూతన విద్య విధానం పై స్పందించిన రాములమ్మ

Vijayashanthi comments on new education policy

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్య విధానంపై ప్రశాంసల జల్లు కురిపించారు విజయశాంతి. దేశంలో ఇప్పటివరకు ఉన్న విద్యా విధానం బాధ్యత గల పౌరులను తయారు చేయడంలో విఫలమైందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు రేపటి పౌరులను తయారు చెయ్యడంలో తమ వంతు కృషి చెయ్యాలని రాములమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  విద్య విధానంపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “దశాబ్దాల కాలంగా మన దేశంలో అమలవుతూ వచ్చిన విద్యావిధానం వివేకం లేని యంత్రాల్లాంటి ఉద్యోగులనే ఎక్కువగా సృష్టించింది తప్ప నాయకత్వ లక్షణాలు గల బాధ్యతగల పౌరుల్ని తయారు చెయ్యడంలో విఫలమైందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితుల్ని తిరగరాస్తూ ప్రధాని మోదీగారి నాయకత్వంలోని ప్రస్తుత సర్కారు గత ఏడాది నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన వ్యవస్థలో అన్ని వర్గాలకూ లాభదాయకంగా ఉండేలా అఖిల భారత వైద్య విద్యలో ఓబీసీలకు 27 శాతం ఈడబ్ల్యుఎస్ వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎంతో శుభపరిణామం.

కరోనా వంటి ప్రకృతి విపత్తులు విలయతాండవం చేస్తున్న తరుణంలో… మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కృత్రిమ మేధస్సులో శిక్షణనివ్వాలన్న ఆలోచన మన కేంద్ర ప్రభుత్వ ముందు చూపునకు దర్పణం పడుతోంది. ఇక ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అందించాలన్న నిర్ణయం మన దేశీయ భాషలకు కొత్త ఊపిరిపోస్తూ భావితరాలకు మాతృభాషలోని మాధుర్యాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే బధిర లిపిని ఇతర భాషల్లాగే విద్యాసంస్థల్లో చదువుకోవడానికి వీలు కల్పించడమన్నది ఆ ప్రత్యేక అవసరాలున్న పౌరుల పట్ల మన ప్రధాని సమ దృష్టిని తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాలను రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకుని బాధ్యత గల రేపటి పౌరులను తయారు చెయ్యడంలో తమ వంతు కృషి చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను.” అని తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss