టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సూచనల మేరకు దాదాపు రెండు నెలల నుంచి ఇళ్లకే పరిమితమవుతున్న గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో అంతుబట్టడం లేదు. మే నెల ఎనిమిదో తేదీ తర్వాత తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతాయని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూసి హైదరాబాద్ వాసులు చాలా ఆశలు పెంచుకున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన తేదీ దాటిన తర్వాత వారం రోజులు గడిచాక కూడా కరోనా కేసులు తగ్గకపోగా మళ్లీ ఈ మహామారి ఇంకా విజృంభిస్తోంది.
హైదరాబాద్ వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ సోకకుండా నియంత్రించేందుకు హైదరాబాద్‌ను టిఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఈ మహానగరంలో ఆంక్షలను చూస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే వెసులుబాటు కూడా లేదు. మరి అలాంటప్పుడు మళ్లీ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా సినీనటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: కరోనా నివారించే మార్గం లేదు – డబల్యూహెచ్ఓ