Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

అది మీకు వర్తిస్తుందా .. కేసీఆర్ కి రాములమ్మ కౌంటర్ 

కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మేయర్‌లను ఉద్దేశించి ‘పని చేయండి లేదా, పదవి నుంచి తప్పుకోండి’ అంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడం పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఫేస్ బుక్ ఖాతాలో స్పందించింది. ‘ఈ వార్నింగ్ కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుందా? లేక పని చేయని పక్షంలో సీఎం కూడా ఆ మాటకు కట్టుబడతారా?’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆమె పేర్కొంది.  గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్‌లను, మేయర్‌ను ఉద్దేశించి హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ప్రగతి రిసార్ట్స్‌లో కేసీఆర్ ఇచ్చిన ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో, అప్పుడు కూడా ఇదే రకమైన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జనాన్ని మభ్య పెట్టేందుకు కేసీఆర్ గారడీ చేసిన విషయం హైదరాబాద్ ఓటర్లు  మర్చిపోలేదని విజయశాంతి కౌంటర్ ఇచ్చింది.

కాగా  కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం, దానికి బీజేపీ నేతల ఎదురుదాడి చేస్తున్న తీరు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రాన్ని నిధుల విషయంలో నిలదీస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం, గత ఐదేళ్ళలో సీఎం దొరవారి పాలనలో ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఏ మేరకు విడుదల చేశారు అనే విషయంపై సమాధానం చెప్పాలని రాములమ్మ డిమాండ్ చేసింది. ‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా  అభివృద్ధి నిధి విడుదల చేయకుండా, మొత్తం ప్రభుత్వ సొమ్మును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దోచి పెట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిధుల విషయంలో కేంద్రం చేసేది తప్పు అయితే, మీరు చేసేది ఎలా రైట్ అవుతుంది? కేంద్రానికి ఒక న్యాయం, కేసిఆర్‌కి ఒక న్యాయమా? అని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. తప్పనిసరిగా టీఆర్ఎస్ అధినాయకత్వం దీనికి సమాధానం చెప్పాల్సిందే’’ అని   విజయశాంతి డిమాండ్ చేసింది.

‘అంతేకాదు,తెలంగాణ అంతటా వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చకపోతే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని కేసీఆర్ చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఇంటింటికి మంచినీరు పథకం అమలైన దాఖలాలు లేవు. ఇలా  గత ఐదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబంధించి ఆయన ఎన్నిసార్లు మాట తప్పారో దానికి ఆయన ఎన్నిసార్లు పదవి నుంచి తప్పుకోవాలో టీఆర్ఎస్ నేతలే లెక్క చెబితే బాగుంటుంది’అని రాములమ్మ ఎద్దేవా చేసింది. దీనిపై గులాబీ దళం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...