Wednesday, April 21, 2021

Latest Posts

కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడానికి కారణం ఆదే.. విజయ శాంతి

తెలంగాణాలో  కరోనా కేసులు తగ్గుమొకం పట్టాయని అనుకుంటున్నా సమయంలో మళ్ళీ కేసులు పెరగడానికి మద్యంషాపులను తెరవడం  ఒక కారణం అంటూ కొందరు బావిస్తున్నారు. అలాగే ఇప్పుడు నటి విజయ శాంతి కూడా ఈ మేరకు తనదైన శైలిలో విమర్శలు చేస్తు  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్ పాటించారు కదా? పాజిటివ్‌ల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి. సరైన సంఖ్యలో పరీక్షలు ఇప్పటివరకూ చేయకుంటే ఆ నిజం ఒప్పుకోండి. అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. వైన్ షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా? ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది. అని తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలలో రాజుకున్న నీటి రగడ

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss