vijayashanti congratulates TS government over twitter
కరోనా కేసులు తెలంగాణలో నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్లుగా కనబడుతున్నాయని (ప్రభుత్వం ప్రకటిస్తున్న వివరాలను అనుసరించి) టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ దైవం కరుణాకటాక్షాలతో మాత్రమే సాధ్యమవుతున్న ఈ శుభపరిణామానికి తోడు లాక్డౌన్కు సంపూర్ణంగా సహకరిస్తున్న ప్రజలకు, శ్రమిస్తున్న వైద్య, ఆరోగ్య, పోలీస్, పారిశుద్ధ్య విభాగాలకు, ప్రభుత్వానికి అభినందనలు.
ఎంఐఎం మరియు ఓవైసీలు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా సమర్థతతో మంత్రిత్వశాఖ నిర్వహిస్తూ ఫలితాలు తెస్తున్న ఈటల రాజేందర్ గారికి ప్రత్యేక అభినందనలు. దైవశక్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా నా ప్రాణప్రదమైన తెలుగు బిడ్డలందరినీ, ఇంకా మన దేశంలోని అన్ని రాష్ట్రాల మరియు యావత్ ప్రపంచ ప్రజలను సంపూర్ణంగా కాపాడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అని తెలిపారు.