Thursday, December 2, 2021

Latest Posts

మారు వేషంలో విజయవాడ సబ్ కలెక్టర్ ఏం చేశారంటే?

Vijayawada Sub Collector Checking In Fertilizer Shops

సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లి విజయవాడ సబ్ కలెక్టర్ కలకలం రేపారు. విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఒక సాధారణ లుంగీ, షర్ట్ తుండువా వేసుకుని
ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లారు. అయితే అక్కడ స్టాక్ ఉన్నా లేవని చెప్పి యజమాని అతనిని పంపించేశాడు. అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు సబ్ కలెక్టర్. సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చి ఎం‌ఆర్‌పి ధర కన్నా అధికంగా వసూళ్లు చేశాడు సదరు షాపు యజమాని. అలానే వాటికి బిల్లు కూడా ఇవ్వలేదు.
దీనితో మారు వేషంలో వెళ్ళిన సబ్ కలెక్టర్ ఆ తర్వాత ఒకొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించి ఆ రెండు షాపులను సీజ్ చేయించారు. ఆ తర్వాత అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపులకు తనిఖీకి వెళ్లారు సబ్ కలెక్టర్ అయితే అక్కడ షాప్ మూసి ఉండడంతో రైతులతో ధరల పై ఆరా తీశారు. ఎం‌ఆర్‌పి ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని సబ్ కలెక్టర్ కు రైతులు చెప్పడంతో
షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశం జారీ చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss