Home రాజకీయం ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ వద్ద స్థానికుల ఆందోళన

ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ వద్ద స్థానికుల ఆందోళన

Villagers protest outside LG Polymers Company

రెండు రోజుల క్రితం విశాఖపట్నం గోపాలాపురం వద్ద ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ లో గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌ లో భాగంగా కంపెనీ వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. అయితే త‌క్ష‌ణ‌మే కంపెనీని మూసివేయాలంటూ స్థానికులు ఆందోళ‌న‌కు దిగారు. జరిగిన ఘటనకు కార‌ణ‌మైన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఘటనకు కారణం అయిన  స్థలన్నీ పరిశీలించేందుకు సవాంగ్‌తో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ అక్కడకు వెళ్లాడు, స్థానికులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహాలతో ఆందోళనకు దిగిన స్థానికులు తమకు న్యాయం చెయ్యాలంటూ డీజీపీని, మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాగే త‌క్ష‌ణ‌మే కంపెనీని మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు.

గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ పేరుతో నామమాత్రపు చర్యలు తీసుకున్నారని ఆరోపిస్తూ గ్యాస్ లీక్ ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ గేట్లను తోసివేసి స్థానికులు లోపలికి వెళ్లి మరీ డీజీపీ, మంత్రిని అడ్డుకున్నారు. ఇప్పటివరకు కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారిని నిలదీశారు.  దాంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు సంయమనం పాటించాలని పోలీసు అధికారులు కోరినా పరిస్థితి అదుపులోకి రాలేదు.

Exit mobile version