Monday, April 19, 2021

Latest Posts

తండ్రైన భారత కెప్టెన్ కోహ్లీ

Virat Kohli Anushka Sharma

భారత కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్‌ విరాట్‌ కోహ్లీ తండ్రయ్యాడు. కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ సోమవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను కోహ్లీ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. “మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోందని కోహ్లీ గతేడాది ఆగస్టులో తెలిపారు.”

‘ఇవాళ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టిందన్న విషయాన్ని  మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అనుష్క,బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు,  మా జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని  ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’‌ అంటూ  టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss