Thursday, December 2, 2021

Latest Posts

హనీట్రాప్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన విశాఖ సైబర్ క్రైం పోలీసులు

Vizag cyber crime police arrested three people in honey trap case

విశాఖ వెలుగుచూసిన హనీట్రాప్ కేసులో సైబర్ క్రైం పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసారు.  విశాఖకు చెందిన యువకుడిని హైదరాబాద్ కి చెందిన భార్య భర్తలు ట్రాప్ చేసి 24 లక్షలు కాజేసారు.  విశాఖ వేపగుంటకు చెందిన యువకుడికి వాట్సాప్ ద్వారా పరిచయమైన యువతీ, వీడియో కాల్ చేసి నగ్నంగా ఉన్నప్పుడు రికార్డ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే వీడియో సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన యువకుడు ఆ జంటకు మొత్తంగా రూ. 24 లక్షలు ఇచ్చాడు.

అయిన వారి వేధింపులు ఆగకపోగా రోజురోజుకీ ఎక్కువ కావడంతో సైబర్ క్రైం పోలీసులు అశ్రాయించాడు బాధితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. భార్య భర్తలు జ్యోతి, వీర సతీష్ తో పాటు అబ్దుల్ రహీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి రూ. 3,50,000 నగదు, ఒక ల్యాప్‌టాప్, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని మీడియాకు వెల్లడించారు డీసీపీ సురేష్‌ బాబు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss