విశాఖ నావీ అధికారుల హనీ ట్రాప్ నిందితుదిని ఎన్ఐఏ అరెస్టు చెయ్యడం జరిగింది. అతనిని ఆజీ అబ్దుల్ రహ్మాన్ గా గుర్తించింది. ఇతన్ని ముంబైలో ఎన్ఐఏ అదికారులు అరెస్టు చేశారు. అబ్దుల్ రెహ్మాన్ కు పాకిస్తాన్ తో సంబందాలున్నాయన్న ఎన్ఐఏ అతనిని అదుపులోకి తీసుకుంది.
విశాఖ హనీ ట్రాప్ ఇష్యూ లో ఇప్పటికే 11 మంది నావీ అధికారులను అరెస్టు చేసింది ఎన్ఐఏ. కాగా అబ్దుల్ రహ్మాన్ పాకిస్తాన్ ఏజెంట్ అఖ్బర్ అలితో కాంటాక్ట్ లో ఉన్నడని, తరచూ అబ్దుల్ రెహ్మాన్ పాకిస్తాన్ లో కరాచీ వెళ్ళి వస్తూ ఉంటాడని నిర్దారించిన ఎన్ఐఏ అదికారులు అబ్దుల్ రెహ్మాన్ ను అదుపులోకి తీసుకోగా, పెద్ద మొత్తంలో నగదు, ఎలక్ట్రిక్ పరికరాలును స్వాధీనం చేసుకుంది.
కాగా ఇండియన్ నావీ అధికారులను అమ్మాయిల ద్వారా వల వేసి, ఇండియన్ నావీకి సంబందించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేయడం ఈ హనీ ట్రాప్ యొక్క ముఖ్య లక్షం. కాగా ఎన్ఐఏ అరెస్టు చేసిన అబ్దుల్ రెహ్మాన్ ద్వారా ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోనుంది ఇండియన్ ఆర్మీ.
ఇది కూడా చదవండి: దూసుకొస్తున్న ‘యాంపిన్’… ఆంధ్రప్రదేశ్ ముందు భారీ తుఫాన్ గండం!