Vizianagaram coronavirus Case
ఇప్పటి వరకు ఏ.పీ ప్రభుత్వం కరోనా శోకని జిల్లాగా గర్వంగా చెప్పుకొనే విజయనగరం జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు బుదవారం (మే 6) న నమోదు అయ్యింది. గ్రీన్ జోన్ గా ఉన్న ఈ జిల్లాలో కరోనా రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. జిల్లా లోని బలిజ పేటకు చెందిన 60ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. సదరు మహిళా కిడ్నీ సంబందిత వ్యాదితో బాధ పడుతున్న ఆమె బుదవారం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చింది. అక్కడ వైద్యులకు అనుమానం వచ్చి కరోన టెస్ట్ చేయగా ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయ్యింది.
ఆ మహిళా యెక్క కుటుంబ సభ్యులను కోరంటైన్ కు తరలించి వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు మహిళ నివసించే ప్రాంతంలో నియంత్రణ చర్యలను ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో, ఆమె చికిత్స నిమిత్తం కొన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ హాస్పటల్ లకు వెళ్లారు. ఆమె వెళ్ళిన హాస్పటల్ సిబ్బందిని, వైద్యులు మొదలైన వారికి పరీక్షలు నిర్వహించారు వాటిలో కూడా కొన్ని నెగిటివే రాగా మరి కొన్ని వాటికోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా లోని అధికారులు 50 బృందాలుగా ఏర్పడి ఆ మహిళకు ఎవరి ఏ విదంగా కరోన సోకిందని అరా తీస్తున్నారు. ఈ విషయం పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.