Vontimitta Kodanda Rama’s kalyanam celebration done Without devotees
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణం మంగళవారం రాత్రి పున్నమి చంద్రుడు సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలను జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ మరియు ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ ఈవో లోకనాథం సమర్పించగా, వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాల తో రాత్రి 8 గంటల ముప్పై నిమిషములకు హస్త నక్షత్ర యుక్త శుభలగ్నంలో ఈ వేడుక జరిగింది. లాక్ డౌన్ దృష్ట్యా కళ్యాణోత్సవానికి ఎవరూ రాకూడదనే నేపథ్యంలో, టీటీడీ అధికారులు వేద పండితులు మధ్య ఈ కళ్యాణం జరిగింది.